ఫైనల్స్ లో అజయ్ భార్య

  • IndiaGlitz, [Friday,June 30 2017]

ఆమె పేరు శ్వేత రావూరి. ఇద్దరు పిల్లలకు తల్లి. 'హాట్‌ మోంద్‌' నిర్వహించిన 2017 మిసెస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ పోటీల్లో ఫైనల్స్‌కు ఎంపికయ్యారు శ్వేత. మహిళలు పెళ్ళి తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం అంత సులభం కాదు. అదీ ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత అది మరింత కష్టం. కానీ, శ్వేత రావూరి దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంది.

శ్వేత ఎవరో కాదు విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్న అజయ్‌ భార్య. తన భార్య మిసెస్‌ ఇండియా పోటీల్లో ఫైనల్‌కు చేరుకోవడం ఆనందంగా వుందని ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. తన భార్యకు విషెస్‌ అందించాల్సిందిగా కోరారు. ఫిట్‌నెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న శ్వేత తను జిమ్‌ చేస్తున్న వీడియోను, ఉదయమే ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న ఫోటోలను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసింది.