'అజయ్ పాసయ్యాడు' జనవరి 4న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రసిద్ధ సినీ పాత్రికేయులు, రచయిత బి.కె.ఈశ్వర్ రచనతో రూపొందిన చిత్రం 'అజయ్ పాసయ్యాడు'. భారతం క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ప్రేమ్ భగీరద్ దర్శకత్వంలో మాగాపు సూర్య కమల-వై.రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ వినోడధాత్మక, స్ఫూర్తి భరిత చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అజయ్ అమన్, సాయికిరణ్ హీరోలుగా అంబిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీ, శివన్నారాయణ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని నిర్మాతలు మాగాపు సూర్య కమల-వై.రాజేంద్ర మాట్లాడుతూ.. మా దర్శకుడు ప్రేమ్ భగీరద్ 'అజయ్ పాసయ్యాడు' చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. నవ్విస్తూ, కవ్విస్తూనే ఆలోచింపజేసే 'అజయ్ పాసయ్యాడు' ఆద్యంతం అందరినీ అలరిస్తుంది. బి.కె.ఈశ్వర్ రచన, సాహిణి శ్రీనివాస్ సంగీతం, నటీనటుల అభినయం ఈ చిత్రానికి హై లైట్ గా నిలుస్తాయి. జనవరి 4న విడుదలవుతున్న అజయ్ పాసయ్యాడు' డిస్టింక్షన్ లో పాస్ అవుతుందనే నమ్మకం మాకుంది.. అన్నారు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com