గూస్ బంప్స్ తెప్పిస్తున్న అజయ్ దేవ్ గణ్ 'భుజ్' ట్రైలర్!

బాలీవుడ్ లో సాహసాలకు మారుపేరు అజయ్ దేవ్ గణ్. తన పాత్ర కోసం అజయ్ ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. అందుకే అజయ్ దేవగణ్ చిత్రాలలో యాక్షన్ సన్నివేశాలు మతిపోగొట్టే విధంగా ఉంటాయి. అజయ్ దేవగణ్ ప్రతిష్టాత్మకంగా నటించిన 'భుజ్'చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

ట్రైలర్ ఆధ్యంతం అద్భుతంగా ఉంది. గూస్ బంప్స్ తెప్పించేలా ట్రైలర్ ని తీర్చిదిద్దారు. ఉత్కంఠ కల్గించే యాక్షన్ సన్నివేశాలు, దేశ భక్తిని ప్రేరేపించే డైలాగులు ట్రైలర్ మొత్తం ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్, ఎమోషన్, డైలాగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా సింక్ అయినట్లు కనిపిస్తోంది.

'నా మరణం గురించి ఆలోచించకండి. వీరుడిగా మిగలాలనుకుంటున్నాను. నా పేరు సైనికుడు' అని అజయ్ చెబుతున్న డైలాగ్ అద్భుతం. అలాగే 'మరాఠా యోధులు చంపుతారు లేదా చస్తారు' అనే డైలాగ్ కూడా బావుంది. అభిషేక్ దుదియ దర్శకత్వంలో ఈ యాక్షన్ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతోంది.

1971 ఇండియా పాక్ వార్ నేపథ్యంలో వస్తావ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ యుద్ధంలో పాక్ ఎయిర్ ఫోర్స్ గుజరాత్ లోని ఇండియన్ ఎయిర్ బేస్ 'భుజ్' ని కూల్చి వేసింది. ఆ టైంలో ఐఏఎఫ్ స్క్వాడ్రన్ నాయకుడు విజయ్ కార్నిక్ ఎలాంటి పోరాటం చేశారు.. 300 మంది స్థానిక మహిళలతో కలసి భుజ్ ని తిరిగి ఎలా నిర్మించారు అనే అంశాలని ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు.

ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, సంజయ్ దత్, ప్రణీత సుభాష్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ చిత్రాన్ని ఆగష్టు 13న హాట్ స్టార్ లో నేరుగా రిలీజ్ చేయనున్నారు.

More News

తేల్చి చెప్పేసిన రజనీకాంత్.. మక్కల్ మండ్రం రద్దు!

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ వస్తున్న ఊహాగానాలపై కుండబద్దలు కొట్టేశారు. సోమవారం రోజు రజనీకాంత్ పోయెస్ గార్డెన్ లోని తన నివాసంలో అభిమానులతో సమావేశం నిర్వహించారు.

Roar of RRR: సంస్కృత రాపర్ ని రంగంలోకి దించిన కీరవాణి!

షూటింగ్ పూర్తి కావస్తుండడంతో దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాలని షురూ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం కొన్ని నెలల టైం పడుతుంది.

హిందీలో 'జనతా గ్యారేజ్' రీమేక్.. కన్నేసిన స్టార్ హీరో

సౌత్ చిత్రాలకు ప్రస్తుతం నార్త్ లో డిమాండ్ ఎక్కువ. బాలీవుడ్ హీరోలు తెలుగు, తమిళ కథలపై మోజు పెంచుకుంటున్నారు. ఇక్కడ ఘనవిజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్ లో వరుసగా రీమేక్ అవుతున్న

'రామారావు' గా డ్యూటీలో రవితేజ.. స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్

మాస్ మహారాజ్ రవితేజ 68వ చిత్రం శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ, ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ ఫై బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా

శిరీష బండ్ల స్పేస్ సూట్ పై ఇండియన్ ఫ్లాగ్.. అతడికి కూడా ఇండియాతో..

తెలుగు వనిత శిరీష బండ్ల చరిత్ర సృష్టించింది. విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించిన మూడో భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు కల్పన చావ్లా, సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్లారు.