గూస్ బంప్స్ తెప్పిస్తున్న అజయ్ దేవ్ గణ్ 'భుజ్' ట్రైలర్!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ లో సాహసాలకు మారుపేరు అజయ్ దేవ్ గణ్. తన పాత్ర కోసం అజయ్ ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. అందుకే అజయ్ దేవగణ్ చిత్రాలలో యాక్షన్ సన్నివేశాలు మతిపోగొట్టే విధంగా ఉంటాయి. అజయ్ దేవగణ్ ప్రతిష్టాత్మకంగా నటించిన 'భుజ్'చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
ట్రైలర్ ఆధ్యంతం అద్భుతంగా ఉంది. గూస్ బంప్స్ తెప్పించేలా ట్రైలర్ ని తీర్చిదిద్దారు. ఉత్కంఠ కల్గించే యాక్షన్ సన్నివేశాలు, దేశ భక్తిని ప్రేరేపించే డైలాగులు ట్రైలర్ మొత్తం ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్, ఎమోషన్, డైలాగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా సింక్ అయినట్లు కనిపిస్తోంది.
'నా మరణం గురించి ఆలోచించకండి. వీరుడిగా మిగలాలనుకుంటున్నాను. నా పేరు సైనికుడు' అని అజయ్ చెబుతున్న డైలాగ్ అద్భుతం. అలాగే 'మరాఠా యోధులు చంపుతారు లేదా చస్తారు' అనే డైలాగ్ కూడా బావుంది. అభిషేక్ దుదియ దర్శకత్వంలో ఈ యాక్షన్ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతోంది.
1971 ఇండియా పాక్ వార్ నేపథ్యంలో వస్తావ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ యుద్ధంలో పాక్ ఎయిర్ ఫోర్స్ గుజరాత్ లోని ఇండియన్ ఎయిర్ బేస్ 'భుజ్' ని కూల్చి వేసింది. ఆ టైంలో ఐఏఎఫ్ స్క్వాడ్రన్ నాయకుడు విజయ్ కార్నిక్ ఎలాంటి పోరాటం చేశారు.. 300 మంది స్థానిక మహిళలతో కలసి భుజ్ ని తిరిగి ఎలా నిర్మించారు అనే అంశాలని ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు.
ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, సంజయ్ దత్, ప్రణీత సుభాష్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ చిత్రాన్ని ఆగష్టు 13న హాట్ స్టార్ లో నేరుగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com