మరాఠా వీరుడి పాత్రలో అజయ్ దేవగణ్
Friday, July 21, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
హిస్టారికల్ కాన్సెప్ట్ సినిమాలు ట్రెండ్ కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్లో పద్మావతి సినిమా ఇప్పుడు తెరకెక్కుతోంది. దీంతో పాటు అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తానాజీ` సినిమా కూడా తెరకెక్కుతోంది. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మహారాష్ట్రకు చెందిన మరాఠా వీరుడు సుబేదార్ తానాజీ మలుసరే జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను అజయ్ దేవగణ్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. . తానాజీ మలుసరే, ప్రజలు, తన నేల తల్లి, తన రాజు ఛత్రపతి శివాజీ కోసం పోరాడారు. అద్భుతమైన భారత చరిత్రలో కీర్తించని యుద్ధవీరుడు అంటూ అజయ్ దేవగణ్ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments