2022 జూన్ 3వ తేదీన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా హిందీ, తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదలవుతున్న 'మైదాన్'

ప్రపంచం లో అత్యధిక గేమ్ లవర్స్ ఆదరించే ఆట ఫుట్ బాల్ (సాకర్). ఈ ఆట నేపధ్యం లో యదార్ధగాద ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'మైదాన్'. ప్రపంచ పటం లో ఫుట్ బాల్ ఆట రంగాన్ని భారత దేశానికి కూడా ఓ ప్రాముఖ్యత ఆపాదించిన ఓ కోచ్ నిజజీవిత కథతో ఈ చిత్రం తెరెకెక్కుతుంది. జీవితం లో నైనా, ఆటలో నైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తే గాని విజయం వరిస్తుంది. క్రీడా నేపధ్యం లో స్ఫూర్తివంతమైన కథగా మైదాన్ నిర్మించబడింది. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ గత ఏడాది రెండు సార్లు విడుదల తేదీ ని కూడా ప్రకటించారు . అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆయా తేదీలలో విడుదల చేయలేదు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రం 2022, జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తున్నాం. ఎవరికి వారు ఇంటిపట్టునే వుండి తమ ప్రాణాలను సురక్షితంగా కాపాడుకున్నారు. అలాంటి పరిస్థితులలో థియేటర్లలన్నీ మూత పడ్డాయి. మన భారత దేశం గర్వపడేలా రూపొందించిన మా మైదాన్ చిత్రం థియేటర్లలో చూస్తేనే థ్రిల్లగా ఉంటుందని, రెండుసార్లు ప్రకటించిన తేదీలలో విడుదల చేయలేకపోయాము. వచ్చేఏడాది జూన్ 3వ తేదీన పక్క ప్రణాళిక తో విడుదల తేదీని ఖరారు చేసాము అన్నారు.

బాదాయ్ హో వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని అందించిన దర్శకుడు రవీంద్ర నాథ్ శర్మ మాట్లాడుతూ గతం లో క్రీడా నేపధ్యం లో వచ్చిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. కబాడీ, క్రికెట్, బాక్సింగ్, రెస్లింగ్, రన్నింగ్ రేస్, వంటి గేమ్స్ నేపధ్యం లో ఎన్నో చిత్రాలు వచ్చాయి కానీ ఫుట్ బాల్ పై ఇండియన్ మూవీ ఇప్పటివరకు నిర్మించలేదు. చిత్రం చూస్తున్నంతసేపు ఫుట్బాల్ స్టేడియం లో మనము వున్నట్లుగా ఆటగాడితో పాటు మనం ఉద్వేగానికి లోనయ్యేటట్లు ఫీల్ అయ్యి సన్నివేశాలు ఉంటాయి. అందుకనే ఇన్నాళ్లు థియేటర్లో మాత్రమే రిలీజ్ చేయాలి అని ఎదురు చూసి విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. అన్నారు

అజయ్ దేవగణ్ తో పాటు నేషనల్ అవార్డు విన్నర్ ప్రియా మణి, బాదాయ్ హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్, నితన్ష్ గోయల్, తది తరులు నటిస్తున్న మైదాన్ చిత్రాన్ని ఫ్రెష్ లైం ఫిలిమ్స్ సహకారంతో జీ స్టూడియోస్ బ్యానర్ పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరుణవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు.

నటి నటులు : అజయ్ దేవగణ్, ప్రియా మణి, గజరాజ్ రావు, రుద్రనీల్ ఘోష్, నితన్ష్ గోయల్.

More News

ఇదే మా కథ’ లాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి - శ్రీకాంత్

సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్

తూర్పుగోదావరి జిల్లాలో పవన్, చిరు టూర్.. ఫ్యాన్స్‌కు పండగే..!!

తూర్పుగోదావరి జిల్లాలో మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. తొలుత శుక్రవారం రాజమండ్రికి రానున్నారు చిరంజీవి. శనివారం పవన్ పర్యట వుంటుంది.

బిగ్‌బాస్ 5లో ‘‘ ఆకలి రాజ్యం ’’... కెప్టెన్సీ కోసం కడుపు మాడ్చుకున్న కంటెస్టెంట్స్ , రేసులో ఆ ముగ్గురు

కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను గెలిచేందుకు కంటెస్టెంట్స్ కుస్తీ  పెట్టారు. దీని వల్ల ఇంటి సభ్యులకు ఫుడ్ విలువ తెలిసొచ్చింది.

చిత్రసీమలో మళ్లీ డ్రగ్స్ కలకలం... మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డ 'సింగం' నటుడు

డ్రగ్స్.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్‌వుడ్ చిత్ర పరిశ్రమలను ఎంతగా కుదిపేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసింది ఈడీ.

కుక్క మొరిగింది... పట్టించుకోవచ్చు: ‘‘ బాలయ్య ’’ ఫోటోతో పోసానికి నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్

అటు ఏపీ మంత్రులు, వైసీపీ నేతు, పోసాని కృష్ణ మురళి తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌పై చేస్తున్న విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.