Download App

Aithe 2.0 Review

సై-ఫై మూవీస్ అన‌గానే ఎప్పుడూ ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి ఉంటుంది. ఇప్పుడున్నదంతా సాఫ్ట్ వేర్ ప్ర‌పంచం. ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌చారం పుణ్య‌మా అని అంద‌రికీ బ్యాంకింగ్ విష‌యాల ఆన్ లైన్ల ట్రాన్సాక్ష‌న్ల గురించి కూడా అవ‌గాహ‌న ఉంది. ఈ నేప‌థ్యంలో సాఫ్ట్ వేర్ క‌థ‌ను తీసుకున్నారు రాజ్ మ‌దిరాజు. ఆ సినిమా ఎలా ఉంది? `ఐతే 2.0` అని పేరు పెట్టి ఏం చెప్పారు? అనేది తెలుసుకోవాలంటే చ‌దివేయండి మ‌రి.

క‌థ:‌

న‌లుగురు కుర్రాళ్లు, ఇద్ద‌రు అమ్మాయిలు మంచి స్నేహితులు. చ‌దువు పూర్త‌య్యాక వాళ్లు ఓ సాఫ్ట్ వేర్‌ను డెవ‌ల‌ప్ చేస్తారు. దానికి యురేకా అని పేరు పెట్టుకుంటారు. ఆ సాఫ్ట్ వేర్ గురించి యామ్ బ్యాంక్ వ్య‌క్తుల‌ను సంప్ర‌దిస్తారు. దీని గురించి తెలుసుకున్న యాం బ్యాంక్ అవినాష్ గంగూలి (ఇంద్ర‌నీల్ సేన్ గుప్తా) వారిని న‌మ్మించి మోసం చేస్తాడు. ఆ సాఫ్ట్ వేర్‌ను త‌న పేరు మీద పేటెంట్ తీసుకుని వీరికి లీగ‌ల్ నోటీసులు పంపిస్తాడు. అయితే హ్యాకింగ్ విధానం ద్వారా అత‌న్ని ఈ గ్యాంగ్ ఎలా దెబ్బ‌తీసింది. వీళ్ల చ‌ర్య‌లు తీసుకున్న అత‌ను ఎలా స్పందించాడు? హ‌్యాకింగ్ త‌ప్ప‌యిన‌ప్పుడు ఈ కుర్రాళ్లు పోలీసుల భారి నుంచి ఎలా త‌ప్పించుకున్నారు? వ‌ంటివ‌న్నీ సెకండాఫ్‌లో చూడాల్సిన అంశాలు..

ప్ల‌స్ పాయింట్లు:

సినిమా క‌థ చాలా మంచిది. `ఎ` సెంట‌ర్ ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యే డీసెంట్ క‌థ‌. సాఫ్ట్ వేర్ చ‌దువులు చ‌దివి ఉద్యోగాలు రాక కొంద‌రు, ప్ర‌తిభ‌ను ఎవ‌రికో ధార‌పోయ‌డం ఇష్టంలేక స్వ‌యంగా ఏదైనా చేసుకుందామ‌నే ధోర‌ణిలో కొంద‌రు చేసే చిన్న ప్ర‌యత్నాల‌కు తెర‌రూపం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. న‌టీన‌టులు కూడా అందుకు త‌గ్గట్టే ఉన్నారు. తెర‌మీద వారి న‌ట‌న కూడా బావుంది. అవినాష్ గంగూలీ పాత్ర‌లో ఇంద్ర‌నీల్ ప‌ర్ఫెక్ట్ గా స‌రిపోయాడు. కొన్ని చోట్ల డైలాగులు కూడా బావున్నాయి.

మైన‌స్ పాయింట్లు:

నేప‌థ్య సంగీతం అస‌లు బాలేదు. పాట‌లు కూడా ఎక్క‌వు. కొన్ని సీన్ల‌లో డైలాగులు ఓవ‌ర్‌ల్యాప్ అయి ప్రేక్ష‌కుడికి కూడా చిరాకు తెప్పిస్తాయి. డ‌బ్బింగ్ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకోవాల్సింది. చాలా సంద‌ర్భాల్లో లిప్ సింక్ కాలేదు. కొన్ని చోట్ల కృత‌కంగా అనిపించాయి. ఎడిటింగ్ కూడా మెప్పించ‌దు. స‌న్నివేశాలను ఇంకాస్త ప‌క‌డ్బందీగా రాసుకుంటే బావుండేది. నిర్మాణ విలువ‌లు కూడా ఆశించినంత స్థాయిలో లేవు.

విశ్లేష‌ణ‌:

టైటిల్‌ని చూడ‌గానే కుతూహ‌లంతో ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కి వ‌స్తాడు. క‌థా ప‌రంగా సినిమా బావున్న‌ట్టే అనిపించినా, స్క్రీన్ ప్లే విష‌యంలో కాస్త వీక్‌గానే అనిపించింది. ఎడిట‌ర్ క‌త్తెర‌కు ఇంకాస్త ప‌దునుపెట్టి, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ఇంకాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే మంచి సినిమా అయి ఉండేది. టెక్నిక‌ల్‌గా ఎంత వృద్ధి చెందినా సీ క్లాస్ ఆడియ‌న్స్ కి ఈ చిత్రంలోని ఫార్ములాలు, హ్యాకింగ్‌, ట్రాన్సాక్ష‌న్స్ వంటివి అర్థం కావ‌డం క‌ష్ట‌మే. కానీ టెక్నిక‌ల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న వారికి మాత్రం అవలీల‌గా అర్థ‌మ‌వుతుంది.

బాట‌మ్ లైన్‌:  ఫుల్లీ టెక్నిక‌ల్ గా 'ఐతే 2.0'

Aithe 2.0 Movie Review in English

Rating : 2.5 / 5.0