ఈ నెల 26న వస్తోన్న 'ఐశ్వర్యాభిమస్తు'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమతి వరం మాధవి సమర్పణలో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను నటించిన చిత్రం 'ఐశ్వర్యాభిమస్తు'. ఎం.రాజేష్ దర్శకుడు. వరం జయంత్ కుమార్ నిర్మాత. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాు పూర్తి చేసుకుని ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వరం జయంత్ కుమార్ మాట్లాడుతూ... "డి.ఇమాన్ సంగీతం సమకూర్చిన మా చిత్రంలోని పాటలు ఇటీవల విడుదల చేశాం. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సెన్సార్ పూర్తైంది. సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. వారి కాంప్లిమెంట్స్‌తో సినిమా పై మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. పాటలు , ట్రైలర్ సినిమా పై క్రేజ్‌ని ఏర్పరిచాయి. బిజినెస్ పరంగా కూడా మంచి స్పందన వస్తోంది.
ఆర్య హీరోగా నటిస్తూ స్వయంగా తమిళ్లో నిర్మించిన చిత్రమిది. అక్కడ మంచి సక్సెస్ సాధించింది. తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన చిత్రం కావడంతో తెలుగు లో రిలీజ్ చేస్తున్నాం. ఆర్య, విశాల్, తమన్నా, సంతానం పాత్రలు సినిమాకు హైలెట్‌గా ఉంటాయి. తమన్న అందం, అభినయం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.
పాటలు , సంభాషణలు ఎక్కడా డబ్బింగ్ సినిమాల కాకుండా తెలుగు స్ట్రెయిట్ ఫిలింలా చాలా క్వాలిటీగా చేయించాం. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన ఆల్ ఎమోషన్స్ మా చిత్రంలో ఉన్నాయి. ఈ నెల 26న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం"అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments