క్వారంటైన్ టైమ్ను సద్వినియోగం చేసుకుంటున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ 19 ఎఫెక్ట్తోదేశమంతటా లాక్డౌన్లో దిగ్బంధనం అయ్యింది. దీంతో సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితం అయ్యారు. షూటింగ్స్ క్యాన్సిల్ అయిపోవడంతో సినీ సెలబ్రిటీలు ఇంట్లోనే ఉంటున్నారు. ఇంటి పని, వంట పని చేస్తున్నారు. సరదాగా పిల్లలతో సమయాన్ని గడుపుతున్నారు. కొందరు సినీ తారలు కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. ఆ కోవలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ చేరింది. ఈ కౌసల్య కృష్ణమూర్తి ఫేమ్ క్వారంటైన్టైమ్లో భరత నాట్యం నేర్చుకుంటోందట.
తన తల్లి మంచి క్లాసికల్ డాన్సర్. తనకు క్లాసికల్ రాదని బాధపడేదట ఐశ్వర్యా రాజేష్. కానీ లాక్డౌన్ వల్ల ఇప్పుడు సమయం దొరకడంతో స్కైప్ ద్వారా భరతనాట్యం శిక్షణను తీసుకుంటున్నానని ఐశ్వర్య తెలిపారు. అంతే కాకుండా కొత్త సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా చదువుతున్నానని ఐశ్వర్యారాజేష్ తెలిపారు. కొత్త విషయాలను నేర్చుకునే సందర్భంలో ప్రతి ఒక్కరిలో ఓ ఎగ్జయిట్మెంట్ ఉంటుందని ఆ తరహా ఎగ్జయిట్మెంట్ ఇప్పుడు తనలో ఉందని, భరత నాట్యం నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది ఈ డస్కీ బ్యూటీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com