ఎన్టీఆర్‌తో ఐశ్వర్యా రాజేష్..?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కోలీవుడ్‌లో విలక్షణ నటిగా పేరు సంపాదించుకుని ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలను అందిపుచ్చుకుంటోన్న తెలుగు అమ్మాయి ఐశ్వర్యా రాజేశ్ జోడీ కడుతుందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా ఏది? అనే సందేహం రాక మానదు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’. ఇందులో ఎన్టీఆర్ జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. అయితే మరో హీరోయిన్‌ను కూడా ఎన్టీఆర్ జోడీగా నటింప చేయాలని రాజమౌళి భావిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు.. కొమురం భీమ్‌ను ఇష్టపడే గిరిజన యువతి పాత్ర ఉంటుందట. ఈ పాత్ర వ్యవథి తక్కువగానే ఉంటుంది. ఈ పాత్రలో ఐశ్వర్యా రాజేశ్‌ను నటింప చేయడానికి రాజమౌళి ఆలోచిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై జక్కన్న అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ‘ఆర్ఆర్ఆర్ర’లో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. రామ్‌చరన్ జోడీగా ఆలియా భట్ నటిస్తోంది. దసరా సందర్భంగా సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com