‘పుష్ప’లో బన్నీకి సోదరిగా ప్రముఖ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. పూర్తి స్థాయి మాస్ హీరోగా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. మాస్ లుక్‌తో ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ద్వారా అల్లు అర్జున్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను పుష్ప టీజర్ మరింతగా పెంచేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తోంది. గిరిజన యువతిగా రష్మిక కనిపించబోతోంది. ఈ ముద్దుగుమ్మ పాత్రపై సుక్కు స్పెషల్ ఫోకస్ పెట్టారని టాక్.
ఇక ఈ సినిమాలోని పాత్రలన్నీ ఒక్కొక్కటిగా రిలీల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పుష్ప’లో బన్నీకి సోదరిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోందని వార్తలు వినిపిస్తోన్నాయి. ఓ ఫారెస్ట్ అధికారి కారణంగా తన చెల్లెలు చనిపోవడంతో అతనిపై పగ తీర్చుకోవడం కోసం పుష్పరాజ్ ఎర్రచందనం దొంగగా మారతాడట. కాబట్టి ఈ సినిమాకు చెల్లి పాత్ర అత్యంత కీలకమవడంతో ఈ పాత్ర కోసం సుక్కు.. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేసినట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర కోసం మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్‌ను సుక్కు తీసుకున్నారు. ఈ సినిమాకు ఫహద్ ఫాజిల్ ఒక ప్లస్ కాబోతున్నారు.
ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో అనసూయ కూడా నటిస్తోంది. ఇప్పటికే సుక్కు డైరెక్షన్లో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా నటిగా అనసూయ మంచి గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ‘పుష్ప’లో కూడా అనసూయ నటిస్తోంది. అనసూయ పాత్రపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.‘పుష్ప’ సినిమాలో కూడా అంతే పవర్ఫుల్ పాత్రను సుక్కు డిజైన్ చేసినట్టు టాక్ నడుస్తోంది. మైత్రిమూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, వెన్నెల కిశోర్, అనసూయ తదితరులు నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్టు 13న సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments