ఐశ్వరరాయ్ కు జోడిగా...
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరో మాధవన్ ఇప్పుడు తమిళం, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా మాధవన్ నటించిన తమిళ చిత్రం విక్రమ్ వేద మంచి విజయాన్ని సాధించింది. మాధవన్ ఇప్పుడు ఫెన్నీ ఖాన్ అనే బాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నారు. ఆ చిత్రం పేరు ఫెన్నీ ఖాన్. ఈ చిత్రంలో అనిల్‌కపూర్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటిస్తున్నారు.
ఓ ప్రముఖ సింగర్ పాత్రలో ఐశ్వర్య నటిస్తుండటం విశేషం. ఐశ్వర్య భర్త పాత్రలో మాధవన్ తెరపై దర్శనమీయనున్నాడు. సాలా ఖద్దూస్ తర్వాత మాధవన్ చేస్తున్న బాలీవుడ్ చిత్రమిది. అతుల్ ముఖర్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఐశ్వర్య పాత్రను ఇప్పుడున్న సింగర్స్ ఆధారంగా చేసుకుని డిజైన్ చేశారేమో డైరెక్టర్ చెప్పాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments