'2.O' లో ఐశ్వర్యా రాయ్!?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్, అందాల తార ఐశ్వర్యా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘రోబో’. 2010లో వచ్చిన ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఘన విజయం సాధించింది ఈ చిత్రం. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో.. రజనీకాంత్, ఎమీ జాక్సన్ జంటగా ‘2.O’ ని ప్రారంభించారు ఈ దర్శకుడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ సైంటిఫిక్ ఫిలిమ్‌కు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటకి వచ్చింది. ‘రోబో’లో నటించిన ఐశ్వర్యా రాయ్ ఈ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇంతవరకు ఈ విషయానికి సంబంధించిన వార్త బయటకి రాలేదు. ‘రోబో’కి ఇది సీక్వెల్ కాదని పలుమార్లు చెప్పిన దర్శకుడు శంకర్.. ఒకవేళ ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ పాత్ర ఉంటే.. దాన్ని ఏవిధంగా డిజైన్ చేసి ఉంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా తెరపైకి రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments