ఫ్రాన్స్ అధ్య‌క్షుడితో ఐశ్వ‌ర్యరాయ్ లంచ్‌

  • IndiaGlitz, [Tuesday,January 26 2016]

కేన్స్ ఫిలింఫెస్టివల్‌కు ప్ర‌తి ఏడాది హాజ‌ర‌య్యే ఐశ‌ర్య‌రాయ్‌కు ప్రాన్స్ ప్ర‌భుత్వం గ‌తంలో దేశంలో రెండో అత్యుత్త‌మ పుర‌సార్కం నైట్ ఆఫ్ ద ఆర్డ‌ర్ ఆప్ ఆర్ట్ అండ్ లెట‌ర్స్ అంద‌జేసింది. ఫ్రాన్స్‌తో ఐశ్వ‌ర్య‌రాయ్‌కు మంచి అనుబంధం కొన‌సాగుతుంది. అందుకే ఫ్రాన్స్ అధ్య‌క్షుడు గౌర‌వార్ధం ఇచ్చిన విందులో ఐశ్వ‌ర్య ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

భార‌త గ‌ణ తంత్య్ర‌వేడుక‌లు ముఖ్య అతిథిగా వ‌చ్చిన ఫ్రాన్స్ అధ్య‌క్ష‌డు ప్రాంకోయిస్ హోలాండ్ విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు గౌర‌వార్ధం ఏర్పాటు చేసిన మ‌ధ్యాహ్న విందులో బాలీవుడ్ న‌టీ ఐశ్వ‌ర్య‌రాయ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. రెడ్ క‌ల‌ర్ బెనార‌స్ ప‌ట్టుచీర‌లో మ‌న సంస్కృతిలో ఐశ్వ‌ర్య సంద‌డి చేశారు. ఓ టేబుల్ వ‌ద్ద వీరిద్ద‌రూ కూర్చొని సినిమాల గురించి చ‌ర్చించుకున్నార‌ట‌.