'సాహో' లో ఎయిర్ టెల్ అమ్మడు
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండడంతో పాటు.. ప్రభాస్ క్రేజ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని నిర్మాతలు భావిస్తుండడంతో.. బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. కాగా.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో షా షా ఛైత్రీ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందట. తెలుగు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా తర్వాత షాషా ఛైత్రీ నటిస్తున్న చిత్రమిదే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments