లోయలో పడిపోయిన విమానం.. 20 మంది మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతోంది. విమానంలో సిబ్బంది సహా మొత్తం 191 మంది ప్రయాణికులున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి చేర్చే ‘వందే భారత్’లో భాగంగా దుబాయ్ నుంచి ప్రయాణికులతో విమానం కోజికోడ్ చేరుకుంది. మరికొద్ది క్షణాల్లో విమానం ల్యాండ్ అవుతోందని.. మాతృభూమిపై అడుగు పెడతామని ప్రయాణికులంతా ఆనందంగా ఉన్నారు.
మరోవైపు జోరు వాన కావడంతో రన్ వే మొత్తం చిత్తడిగా ఉంది. దీంతో విమానం రన్‌వేను తాకగానే పట్టుకోల్పోయింది. రన్‌వే చివరి దాకా వేగంగా దూసుకెళ్లి 50 అడుగుల లోతైన లోయతో పడిపోయింది. పెద్ద శబ్దంతో రెండు ముక్కలై పోయింది. మాతృదేశాన్ని చేరామన్న ఆనందం రెప్పపాటులో ఆవిరై పోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పైలెట్లు ఇద్దరూ మృతి చెందారు. మిగిలిన వారందరికీ గాయాలయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments