వ్యాక్సిన్ కి కూడా లొంగని డెల్టా కోవిడ్ వేరియంట్.. ఎయిమ్స్ స్టడీ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచానికి పెను సవాల్ గా మారిన కోవిడ్ 19 తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. జన జీవితాలని అతలాకుతలం చేస్తూ విజృంభిస్తోంది. కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిర్ధారించలేని పరిస్థితి. ఎవరికి వారు జాగ్రత్త చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.
ఇదీ చదవండి: శభాష్ బాలయ్య ఫ్యాన్స్.. 500 మందికి ఉచిత వ్యాక్సిన్!
వ్యాక్సిన్ తో ఆశలు చిగురించినప్పటికీ తాజాగా వైద్య నిపుణుల అధ్యయనం ఆందోళన పెంచే విధంగా ఉంది. తాజాగా ప్రభావం చూపుతున్న డెల్టా కోవిడ్ 19 వేరియంట్ వ్యాక్సిన్ లకు కూడా లొంగడం లేదని ఎయిమ్స్ స్టడీలో తేలింది. వ్యాక్సిన్ ప్రభావాన్ని కూడా ఈ డెల్టా వేరియంట్ బలంగా తట్టుకుని నిలబడుతోందట.
ఎయిమ్స్ సంస్థ 63 మంది పేషంట్స్ తో ఈ అధ్యయనం నిర్వహించింది. అందులో 36 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. 27 మంది ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో చాలా మందికి వ్యాక్సిన్ తీసుకొని పేషంట్స్ తరహాలోనే డెల్టా వేరియంట్ ఉన్నట్లు తెలిపారు.
అయితే ఈ 63 మందిలో ఎలాంటి మరణాలు లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 66 శాతం మందికి, సింగిల్ డోస్ తీసుకున్న వారిలో 77 శాతం మందికి డెల్టా వేరియంట్ ఉన్నట్లు ఎయిమ్స్ తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments