Owaisi:మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా, బోధన్‌లో బీఆర్ఎస్‌ను ఓడిస్తాం .. మరిన్ని స్థానాల్లోనూ బరిలోకి ఎంఐఎం: ఒవైసీ
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు .. ఆయనకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన.. బోధన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌ను ఓడిస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎంఐఎం పోటీ చేస్తుందని ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వచ్చే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో త్వరలోనే చెబుతానని అసదుద్దీన్ చెప్పారు.
కవిత కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాం :
బోధన్‌లో ఎంఐఎం నాయకులపై కేసులు పెట్టడం అమానుషమని.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కుమార్తె కవిత కోసం వారంతా రాత్రింబవళ్లు కష్టపడ్డారని ఒవైసీ తెలిపారు. అయినప్పటికీ ఎంఐఎం నేతలను అరెస్ట్ చేశారని.. తెలంగాణలో ముస్లింలకు కూడా రైతు బంధు ఇవ్వాలని ఒవైసీ డిమాండ్ చేశారు. గతంలోనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని.. సచివాలయ నిర్మాణం సమయంలో కూల్చిన మసీదులు నిర్మించాలని ఆయన కోరారు.
ఒవైసీ యూటర్న్ తీసుకున్నారా :
అయితే ఇప్పటి వరకు కేసీఆర్ వెంట నడిచిన ఒవైసీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు రాష్ట్రంతో పాటు దేశంలో సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఒవైసీ మనసు మార్చుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వల్లే తాము యూపీఏకు దూరమయ్యామని ఒవైసీ పేర్కొనడం ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments