Asaduddin Owaisi:జైల్లో చంద్రుడు హ్యాపీ.. బాబును నమ్మలేం, జగన్ పాలన సూపర్ : అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీసీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌పై పలు పార్టీల నేతలు స్పందిస్తున్నారు. ఆయన అరెస్ట్ అక్రమని, సరికాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రుడు చాలా హ్యాపీగా వున్నారని.. ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పోటీపైనా తేల్చేసిన కీలక వ్యాఖ్యలు :
ప్రస్తుతం అక్కడ (ఆంధ్రప్రదేశ్)లో రెండే పార్టీలు వున్నాయని ఒవైసీ అన్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు అసదుద్దీన్ ఒవైసీ. జగన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని, కానీ చంద్రబాబును మాత్రం ఎప్పటికీ నమ్మలేమని, ఆయన్ని నమ్మొద్దన్నారు. ఏపీ ఎన్నికల్లో పోటీ విషయంపైనా అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసే యోచనలో వున్నామన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మనం పనిచేయాల్సిన అవసరం వుందన్నారు.
స్నేహం ముసుగులో వెన్నుపోటును సహించం :
మరోవైపు.. తెలంగాణలో తమకు మిత్రపక్షమైన బీఆర్ఎస్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం కార్యకర్తలు, నేతలను వేధిస్తున్న ఎమ్మెల్యేలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటామని ఒవైసీ హెచ్చరించారు. తమతో స్నేహంగా మెలిగితే చేయి అందిస్తామని, కానీ స్నేహం పేరుతో వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. పదవులపై తమకు ఎలాంటి ఆశలు లేవని, కేవలం పేదల కోసమే పనిచేస్తున్నామని అసదుద్దీన్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments