తొలి పార్టీగా ‘ఎంఐఎం’ ఆల్‌టైమ్ రికార్డ్!
- IndiaGlitz, [Friday,September 27 2019]
రాజకీయ పార్టీలు రాణించాలంటే సోషల్ మీడియా ఏ విధమైన కీలకపాత్ర పోషిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు.. ఒకప్పుడు రాజకీయ నాయకుడు ఇంటింటికి వెళ్లేవాడు.. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు దాదాపు లేవు.. సోషల్ మీడియాతోనే ప్రచారం అంతా సాగిపోతోంది. ఈ సోషల్ మీడియా వల్లనే పార్టీలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కూడా. ఇదే సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లివ్వడం.. విమర్శలు గుప్పించడానికి ఇదే మీడియానే వేదికగా మారుతోంది.
ఇక అసలు విషయానికొస్తే.. టిక్ టాక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతవరకూ దీన్ని ఏ పొలిటికల్ పార్టీ టచ్ చేయలేదు. అయితే ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీ ఎంఐఎం పార్టీ.. టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టింది. అంటే ఇకపై పొలిటికల్ వ్యవహారాలు కూడా టిక్‌టాక్‌లో చూడొచ్చన్న మాట. కాగా.. టిక్‌టాక్‌లో ఖాతా తెరిచిన తొలి పార్టీగా ఎంఐఎం ప్రత్యేకతను సాధించిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎంఐఎంకు 7 వేలకు పైగా ఫాలోయర్లు చేరిపోవడం విశేషమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఎంఐఎం పార్టీ మాత్రమే ఖాతా తెరిచింది.. మున్ముంథు ఈ బాటలో ఎన్ని పార్టీలు నడుస్తాయో వేచి చూడాలి మరి.