Sarath Babu : విషమంగానే శరత్ బాబు ఆరోగ్యం.. హెల్త్ కండీషన్స్‌పై డాక్టర్ ఏం చెప్పారంటే ..?
Send us your feedback to audioarticles@vaarta.com
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలిలోని ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే వుందని.. మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. శరత్ బాబు ఆరోగ్య పరిస్ధితిపై ఎవ్వరూ వదంతులు వ్యాప్తి చేయొద్దని ఆసుపత్రి వర్గాలు విజ్ఞప్తి చేశారు. శరత్ బాబు కుటుంబ సభ్యులు లేదా ఏఐజీ ఆసుపత్రి నుంచి వచ్చే వార్తలను మాత్రమే ప్రజలు పరిగణనలోనికి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
శరత్ బాబును చంపేసిన సెలబ్రిటీలు :
మరోవైపు.. శరత్ బాబు తుదిశ్వాస విడిచారంటూ బుధవారం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే వీటిపై శరత్ బాబు సోదరి సరిత స్పందించారు. శరత్ బాబు చనిపోయినట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయన కొంచెం కోలుకోవడంతో మరోరూమ్‌కి షిఫ్ట్ చేసినట్లు సరిత తెలిపారు. త్వరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడతారని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో శరత్ బాబు గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దని సరిత కోరారు. అయితే సీనియర్ నటి కుష్భుతో పాటు కొందరు సెలబ్రిటీలు ట్వీట్ చేయడం వల్లే ఈ పరిస్ధితి వచ్చింది. దీంతో శరత్ బాబు మృతికి పలువురు సంతాపం తెలిపారు కూడా. చివరికి అసలు విషయం తెలుసుకుని నాలుక కరచుకున్నారు.
ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు :
కాగా.. కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో శరత్ బాబు బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం నిలకడగా వుందని భావించినా.. మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను హైదరాబాద్ ఏఐజీకి తరలించారు. నాటి నుంచి ఆయనను ఐసీయూలో వుంచి చికిత్స అందిస్తున్నారు. అయితే శరరీం మొత్తం ఇన్‌ఫెక్షన్ వ్యాపించడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి కీలక అవయవాలు పాడైపోయినట్లుగా ఏఐజీ వైద్యులు ఇటీవల హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. దీంతో ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం శరత్ బాబు కోలుకుంటున్నట్లుగా ఆయన సోదరి సరిత తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments