Aha Naa Pellanta: 75 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన ‘అహ నా పెళ్ళంట’
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5 నుంచి రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒరిజినల్ ‘అహ నా పెళ్లంట’. ఈ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 17 నుంచి జీ 5లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆక్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటనేదే అసలు కథ. మన కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు తన ప్రేమికుడు వెళ్లిపోతుంది. అప్పుడు మన హీరో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా. సంజీవ్ రెడ్డి ఈ వెబ్ సిరీస్‌ను ఆద్యంతం ఆసక్తిగా తెరకెక్కించారు.
8 ఎపిసోడ్స్‌తో రూపొందిన ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ విశేషమైన ఆడియెన్స్ ఆదరణ పొందుతూ ఇప్పటికే 75 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. దీనికి వస్తోన్న హ్యూజ్ రెస్పాన్స్‌తో రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ అండ్ టీమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రీసెంట్ టీమ్ అంతా కలసిఇ హౌస్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్‌లో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, రాజా చెంబోలు కూడా జాయిన్ అయ్యారు. బ్లాస్టింగ్ పార్టీని టీమ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి, రాజా చెంబోలు జీ 5 సిరీస్‌లో భాగమవుతున్నారు. ప్రముఖ రైటర్, నిర్మాత కోన ఫిల్మ్ కార్ప్ అధినేత కోన వెంకట్ ఈ వెబ్ షోను పర్యవేక్షిస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌ను కోన వెంకట్ క్రియేట్ చేశారు. మీ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే జీ 5లో ప్రసారమవుతున్న ‘అహ నా పెళ్ళంట’ ట్యూన్ చేయాలి.
నటీనటులు: రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణమురళి, గెటప్ శీను, జబర్దస్త్ రాజమౌళి, తాగుబోతు రమేష్, మధునందన్, భద్రమ్, రఘు కారుమంచి, దొరబాబు తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments