పీవీ నరసింహరావుపై వెబ్ సిరీస్.. తెరకెక్కించనున్న ప్రకాశ్ ఝా, ఆహాలో స్ట్రీమింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు జాతి సత్తాను , సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ పీవీ నరసింహారావు. బ్యాంకుల్లో వున్న బంగారంతో దేశం నడుస్తున్న కాలంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశ ఆర్ధిక ప్రగతికి బాటలు వేశారు పీవీ. మైనారిటీలో వున్న ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపిన అపర చాణిక్యుడు. సంఘ సంస్కర్తగా బహుభాషావేత్తగా, సామాజికవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ, ఆర్ధికవేత్తగా పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారు.
అలాంటి గొప్ప వ్యక్తిపై త్వరలో ఓ వెబ్ సిరీస్ తెరకకెక్కనుంది. బాలీవుడ్ నిర్మాత ప్రకాష్ ఝా దీనిని నిర్మించనున్నారు. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఇది ప్రసారం కానుంది. 1991-96 మధ్యకాలంలో భారత ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, బాబ్రీ మసీదు కూల్చివేత , ముంబై బాంబు పేలుళ్లు.. ఇలా ఆయన జీవితంలోనూ ప్రతీ కోణాన్ని.. ఈ వెబ్ సిరీస్లో చూపించనున్నారు. వినయ్ సత్పతి రాసిన ‘ది హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా అప్లాస్ ఎంటర్టైన్మెంట్ ఈ వెబ్ సిరీస్ నిర్మించనుంది. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దీనిని తెరకెక్కించనున్నట్టు నిర్మాత ప్రకాష్ ఝా ప్రకటించారు. ప్రస్తుతం రచనా కార్యక్రమాలు జరుగుతున్నాయని, నటీనటులను ఖరారు చేయలేదని చెప్పారు.
ఇక ఆహా విషయానికి వస్తే.. తొలి తెలుగు ఓటీటీ సంస్థగా మొదలై ఈ రంగంలో సంచలనంగా మారింది. సినిమాలు, వెబ్ సిరీస్లు, టాక్ షోలతో ప్రేక్షకులను పెంచుకుంటూ పోతోంది. మొదలైన 21 నెలల్లోనే ఏకంగా 11 మిలియన్ల డౌన్లోడ్స్తో బడా ఓటీటీ సంస్థలకు సైతం గట్టి పోటీనిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com