వాయిదాపడిన 'అజ్ఞాతవాసి' ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ చిత్రం అజ్ఞాతవాసి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతంలో ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్ 26న విడుదల చేయనున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి.
అయితే కొన్ని కారణాల వల్ల ఈ ట్రైలర్ రిలీజ్‌ని వాయిదా వేశారని తెలిసింది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. జనవరి 5న అజ్ఞాతవాసి ట్రైలర్ విడుదల కాబోతుందని సమాచారమ్. అలాగే ఈ నెల 29న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుగనుండగా.. ఈ నెల 31న పవన్ పాడిన కొడకా కోటేశ్శరరావా.. అనే పాటను విడుదల చేయనున్నారు.
ఇక, సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కుష్బూ, బొమన్ ఇరాని, రావు రమేష్, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, నదియా అతిథి పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com