29న 'అజ్ఞాతవాసి' సెన్సార్?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి పవన్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అనిరుధ్ సంగీతంలో రూపొందిన పాటలను రేపు హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. కాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఈ నెల 29న జరుగనున్నాయని టాలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి.
కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో కుష్బూ, బొమన్ ఇరాని, మురళి శర్మ, రావు రమేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సీనియర్ కథానాయకుడు వెంకటేష్.. ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా, జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ సినిమా తెరపైకి రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments