అజ్ఞాత‌వాసికి స్ఫూర్తి ఆ పుస్త‌క‌మేనా?

  • IndiaGlitz, [Sunday,December 17 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న 25వ చిత్రం అజ్ఞాత‌వాసి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. శ‌నివారం విడుద‌ల చేసిన ఈ చిత్రం టీజ‌ర్‌కి ప‌వ‌న్ అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. జ‌న‌వ‌రి 10న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వినిపిస్తోంది.

అదేమిటంటే.. లార్గో వించ్ అనే బెల్గేయిన్ కామిక్ బుక్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింద‌ట‌. ఇదే పుస్త‌కం ఆధారంగా అదే టైటిల్‌తో ఓ ఫ్రెంచ్ మూవీ 2008లో వ‌చ్చింది. మ‌ళ్లీ ప‌దేళ్ల త‌రువాత అదే పుస్త‌కం ఆధారంగా తెలుగులో సినిమా రానుండ‌డం విశేషం. అయితే.. ఈ వార్త‌ల్లో నిజ‌ముందో సినిమా విడుద‌ల‌య్యాకే తెలుస్తుంది.

ఒంట‌రి పోరాటం చిత్రం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. ఇప్పుడేమో లార్గో వించ్ కామిక్ బుక్ పేరు వినిపిస్తోంది. కాగా, ఈ నెల 19న అజ్ఞాత‌వాసి ఆడియో కానుంది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందించారు.