Agnipath protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన హింసాత్మకం.. పోలీసుల కాల్పులు, ఒకరి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
సాయుధ బలగాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా యువత, ప్రజా సంఘాలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. నిన్న ఉత్తరాదిలో జరిగిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇది తెలంగాణకు పాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఆందోళనకారులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వారిని నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టినా ఫలితం లేకపోయింది. ఎంతకూ ఆందోళన విరమించకపోవడంతో టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడం, ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఒకరు మృతిచెందగా మరికొందరికి గాయాలయ్యాయి. మరణించిన వ్యక్తిని నిర్మల్‌కు చెందిన దామోదర్ కురేషియాగా గుర్తించారు.
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు:
మరోవైపు.. గాల్లోకి కాల్పులు జరిపిన సమయంలో జరిగిన తోపులాటలో పలువురు యువకులు గాయపడ్డారు. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తల నేపథ్యంలో రైల్వేస్టేషన్ చుట్టుపక్కల పోలీసులు భారీగా మోహరించారు. అంతకుముందు ఈస్ట్‌కోస్ట్ రైలుకు నిప్పు పెట్టడంతో అందులోని ఓ బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరికొన్ని బోగీలకూ మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments