'అజ్ఞాతవాసి' పాటలు అప్పుడేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
'అజ్ఞాతవాసి' పాటలు గురించి ఈ మధ్య చర్చ ఎక్కువగా సాగుతోంది. బైటకొచ్చి చూస్తే అనే సింగిల్ విడుదలైనప్పటి నుంచి 'అజ్ఞాతవాసి' పాటల మీద ఆసక్తి ఎక్కువైంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న సినిమా ఇది. కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎప్పుడో అనిరుద్ పనిచేయాల్సింది.
'అ ఆ' సినిమా సమయంలో వారి కాంబినేషన్ కుదిరినట్టే కుదిరి మరలా వెనక్కి తగ్గింది. సో వీరిద్దరు కలిసి తొలిసారి పనిచేస్తున్న ఈ సినిమాలో ఐదు పాటలున్నాయి. ప్రస్తుతం బల్గేరియాలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ సెట్లో నుంచి కొన్ని ఫొటోలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అనిరుద్ స్వరపరచిన పాటలు డిసెంబర్ 14న విడుదల కానున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments