మృతదేహంపై కూర్చొని అఘోరా పూజలు.. అవాక్కయిన జనం, ఎక్కడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
అఘోరాలు.. వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలో వీరికి ప్రత్యేక స్థానం, గుర్తింపు వుంది. కుటుంబాన్ని , సంసార బాధ్యతలను వదిలేసి పరమేశ్వరుడి సేవకే వీరు జీవితాన్ని అంకితం చేస్తారు. ఒళ్లంతా విబూది పూసుకుని , స్మశానాల్లో శవాలను పీక్కుంటూ తిరిగే వీరిని చూస్తూ వెన్నులో వణకుపుట్టడం ఖాయం. ఉత్తర భారతదేశంలో కాశీ, ప్రయాగ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించిన వారికి ఈ అఘోరాలను ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది. ఇక అఘోరాల కథలతో వచ్చే సినిమాలన్నీ సూపర్‌హిట్టే. ఇండియాలో వాళ్లకి అంతటి క్రేజ్ వుంటుంది.
భార్యతో గొడవలు.. భర్త ఆత్మహత్య :
ఇదిలావుండగా.. తమిళనాడులోని ఓ వూరిలో చనిపోయిన వ్యక్తి ఇంటికి వచ్చిన అఘోరా, మృతదేహంపై కూర్చొని పూజలు చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా సూలూర్ సమీపంలోని కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్‌కు అతని భార్యతో నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆదివారం భార్యాభర్తలు మరోసారి గొడవ పడగా.. మణికంఠన్ తీవ్ర మనస్తానికి గురయ్యాడు. ఇక ఈ లోకంలో తానుండలేనంటూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు , సన్నిహితులు మణికంఠన్ మృతదేహానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
తిరుచ్చి నుంచి వచ్చిన అఘోరా :
అయితే అతనికి తిరుచ్చిలో చిన్ననాటి మిత్రుడు ఒకడు వుండేవాడు. మణికంఠన్ మరణించిన విషయం తెలుసుకున్న అతను సూలూర్ వచ్చాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. ప్రస్తుతం అఘోరాగా వుంటున్న సదరు మిత్రుడు.. ఒంటి నిండా విభూదితో రౌద్రంగా మణికంఠన్ ఇంటికి వచ్చాడు. అంతేకాదు మృతదేహం మీద కూర్చొని మంత్రాలు చదువుతూ ఏవేవో పూజలు చేశాడు. దీంతో విషయం ఆ నోటా ఈ నోటా వైరల్ అయ్యింది. ప్రస్తుతం తమిళనాడులో ఎక్కడ చూసినా ఈ అఘోరా గురించే చర్చించుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments