`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` సెన్సార్ పూర్తి.. జూన్ 21న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను తెచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తున్నారు.
స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. నవీన్ ఈచిత్రంలో డిటెక్టివ్ పాత్రధారిగా నటించారు. సినిమా ఆసాంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు.
డిఫరెంట్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. మళ్ళీరావా చిత్రాన్ని అందించిన రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com