హైదరాబాద్‌లో మరోసారి లాక్డౌన్.. భయపడాల్సిందేమీ లేదన్న కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌కు సమయం ఆసన్నమైంది. రోజు రోజుకూ జీహెచ్ఎంసీ పరిధిలోనే వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. రెండు, మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి.. ఆపై అవసరమనుకుంటే కేబినెట్‌ను సమావేశపరిచి లాక్డౌన్ విధిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
లాక్డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నదని... అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువేనన్నారు. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదన్నారు. పాజిటివ్‌గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
కాగా.. ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో కూడా తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. కోవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమే అని ఆమె పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments