అన్నదమ్మలిద్దరికీ..ఆరేళ్ల తరువాత!
Send us your feedback to audioarticles@vaarta.com
స్వతహాగా తమిళ కథానాయకులైనా.. తెలుగులోనూ మంచి మార్కెట్ని సంపాదించుకున్నారు 'బ్రదర్స్' సూర్య, కార్తీ. మొదట 'గజిని'తో సూర్యకి ఇక్కడ మార్కెట్ ఏర్పడితే.. ఐదేళ్ల తరువాత అన్న అడుగుజాడల్లో నడుస్తూ 'ఆవారా'తో కార్తీ కూడా ఇక్కడ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. ఒకే ఏడాదిలో ఈ ఇద్దరికి తెలుగులో మంచి విజయాలు వచ్చాయి కూడా. 2010లో కార్తీ నటించిన 'ఆవారా'.. సూర్య నటించిన 'యముడు' చిత్రాలు అనువాద రూపంలో మంచి వసూళ్లను సంపాదించుకున్నాయి. అయితే ఆ తరువాతే కథ మారింది.
'ఆవారా' తరువాత 'నా పేరు శివ' మినహాయిస్తే కార్తీకి ఒక్క హిట్ లేదు. ఇంకా చెప్పాలంటే.. తమిళంలో విజయం సాధించినప్పటికీ 'మెడ్రాస్', 'కొంబన్' చిత్రాలు ఇక్కడ డబ్బింగ్ కాలేదు. ఇక సూర్యకి అయితే 'యముడు' తరువాత సరైన హిట్ సినిమా ఒక్కటీ పడలేదు. ఈ నేపథ్యంలో 2016 వారిద్దరి జాతకాన్ని మరోసారి మార్చేసింది.
'ఊపిరి'తో నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీకి ఆ సినిమాతో గ్రాండ్ వెల్కమ్ దక్కింది. మరో విజయం అతని ఖాతాలో చేరింది. ఇక '24'తో సూర్యకి కూడా ప్రశంసలతో పాటు సక్సెస్ వరించింది. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ ఆరేళ్ల తరువాత ఒకే సంవత్సరంలో తెలుగునాట విజయాలు అందుకున్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments