అన్నదమ్మలిద్దరికీ..ఆరేళ్ల తరువాత!

  • IndiaGlitz, [Saturday,May 14 2016]

స్వ‌త‌హాగా త‌మిళ క‌థానాయ‌కులైనా.. తెలుగులోనూ మంచి మార్కెట్‌ని సంపాదించుకున్నారు 'బ్ర‌ద‌ర్స్' సూర్య‌, కార్తీ. మొద‌ట 'గ‌జిని'తో సూర్య‌కి ఇక్క‌డ మార్కెట్ ఏర్ప‌డితే.. ఐదేళ్ల త‌రువాత అన్న అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ 'ఆవారా'తో కార్తీ కూడా ఇక్క‌డ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. ఒకే ఏడాదిలో ఈ ఇద్ద‌రికి తెలుగులో మంచి విజ‌యాలు వ‌చ్చాయి కూడా. 2010లో కార్తీ న‌టించిన 'ఆవారా'.. సూర్య న‌టించిన 'య‌ముడు' చిత్రాలు అనువాద రూపంలో మంచి వ‌సూళ్ల‌ను సంపాదించుకున్నాయి. అయితే ఆ త‌రువాతే క‌థ మారింది.

'ఆవారా' త‌రువాత 'నా పేరు శివ' మిన‌హాయిస్తే కార్తీకి ఒక్క హిట్ లేదు. ఇంకా చెప్పాలంటే.. త‌మిళంలో విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ 'మెడ్రాస్‌', 'కొంబ‌న్' చిత్రాలు ఇక్క‌డ డ‌బ్బింగ్ కాలేదు. ఇక సూర్య‌కి అయితే 'య‌ముడు' త‌రువాత స‌రైన హిట్ సినిమా ఒక్క‌టీ ప‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో 2016 వారిద్ద‌రి జాత‌కాన్ని మ‌రోసారి మార్చేసింది.

'ఊపిరి'తో నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీకి ఆ సినిమాతో గ్రాండ్ వెల్‌క‌మ్ ద‌క్కింది. మ‌రో విజ‌యం అత‌ని ఖాతాలో చేరింది. ఇక '24'తో సూర్య‌కి కూడా ప్ర‌శంస‌ల‌తో పాటు స‌క్సెస్ వ‌రించింది. మొత్తానికి అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఆరేళ్ల త‌రువాత ఒకే సంవ‌త్స‌రంలో తెలుగునాట విజ‌యాలు అందుకున్నార‌న్న‌మాట‌.

More News

మహేష్ నెక్ట్స్ మూవీలో పాట పాడనున్న హీరోయిన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మించింది.

'జెంటిల్ మన్' టీజర్ కి మంచి స్పందన

నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'జెంటిల్ మన్' .మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.

చిరు మూవీ కోసం దేవిశ్రీ సిట్టింగ్స్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ చిత్రానికి వినాయక్ దర్శకుడు.

చంద్రముఖి -2 లో అనుష్క..

రజనీకాంత్,ప్రభు,జ్యోతిక,నయనతార కాంబినేషన్లో రూపొందిన చంద్రముఖి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

ఇక రామ్ చరణ్ కి ఏం జరుగుతుందో?

చిన్న సినిమాలతో తొలి అడుగులు వేసి..వరుస విజయాలతో తక్కువ కాలంలోనే పెద్ద హీరోయిన్ గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్.