మొన్న శ్రుతి హాసన్...నిన్న తమన్... నేడు కృతి..
- IndiaGlitz, [Saturday,October 03 2015]
యాదృచ్ఛింగా జరుగుతున్నా ఓ విషయం మాత్రం గమ్మత్తుగా వరుస సంవత్సరాలలో చోటు చేసుకుంటోంది మన టాలీవుడ్‌లో. అదేమిటంటే.. ఇక్కడ ఓ టైటిల్‌తో ఓ సినిమా తీస్తుంటే.. బాలీవుడ్‌లోనూ, కన్నడంలోనూ, తమిళంలోనూ అదే టైటిల్‌తో సినిమాలు తెరకెక్కడం. ఇక్కడితో అది ఆగిపోతే ఫర్లేదు.. విశేషంగా అలా ఒకే టైటిల్‌తో రూపొందే సినిమాల కోసం ఏదో ఒక కామన్ ఫ్యాక్టర్ మాత్రం ఉంటోంది.
అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. 2013లో ఇలాంటి అనుభూతిని తెలుగులో రూపొందిన 'రామయ్యా వస్తావయ్యా', హిందీలో రూపొందిన అదే టైటిల్ గల చిత్రం కోసం శ్రుతి హాసన్ ఎక్స్‌పీరియన్స్ అయితే.. 2014లో సంగీత దర్శకుడు తమన్ అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఇతగాడి సంగీత దర్శకత్వంలో తెలుగులో 'పవర్' పేరుతో రవితేజ హీరోగా ఓ సినిమా వస్తే.. దాని కంటే ముందు 'దూకుడు' కన్నడ రీమేక్ అదే పేరుతో ఓ నెల క్రితం విడుదలైంది. ఈ రెండూ విజయాలు అందుకున్నాయి. ఇక 2015లో ఈ విషయంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యింది నటి కృతి కర్బందా. తెలుగులో ఆమె నటించిన రామ్‌చరణ్ 'బ్రూస్‌లీ' ఈ నెలలోనే రిలీజ్ కానుండగా.. తమిళంలో అదే పేరుతో ఆమె నటిస్తున్న జి.వి.ప్రకాష్ 'బ్రూస్‌లీ' ఈ ఏడాది చివరి లోపు విడుదలయ్యే దిశగా ఉంది. మరి వచ్చే సంవత్సరంలో ఈ లిస్ట్‌లో ఏ సెలబ్రిటీ చేరుతారో చూడాలి.