ఏడేళ్ల తరువాత..
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ చౌతా.. ఈ పేరు వినగానే 'నిన్నే పెళ్లాడుతా', 'ప్రేమకథ', 'సూపర్', 'బుజ్జిగాడు' లాంటి మ్యూజికల్ హిట్స్ గుర్తుకువస్తాయి. పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసినప్పటికీ గుర్తుండిపోయే బాణీలు ఇచ్చిన సందీప్.. తెలుగులో చివరిగా చేసిన చిత్రం 'కేడి'. నాగార్జున సినిమా(నిన్నే పెళ్లాడుతా)తో మొదలు పెట్టి .. అదే నాగ్ సినిమా 'సూపర్'తో సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టిన సందీప్.. చివరకి అదే నాగ్ చిత్రం 'కేడి' తరువాత తెలుగు సినిమాలకి దూరమయ్యాడు.
అయితే.. మళ్లీ సందీప్ పేరు ఓ సినిమా కోసం వార్తల్లో నిలుస్తోంది. సందీప్ చౌతా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 'సూపర్'కి డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పూరీ ఆకాష్ నటించే చిత్రానికి సంగీత దర్శకుడిగా సందీప్ పేరే వినిపిస్తోంది. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఏదీఏమైనా.. సందీప్ మూడో ఇన్నింగ్స్ ఆయన అభిమానులకి శుభవార్తే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com