అప్పుడు సమంత.. ఇప్పుడు కీర్తి సురేష్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా వస్తుందంటే.. ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక విడుదల కాబోయేది.. ఆయన 25వ చిత్రమైతే.. ఆ అంచనాలకు ఆకాశమే హద్దు. అలా భారీ అంచనాలతో జనవరి 10న రానున్న పవన్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. 'జల్సా', 'అత్తారింటికి దారేది' తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన 'అజ్ఞాతవాసి'లో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి.. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఇంతకీ అదేమిటంటే.. ఈ సినిమాలో కీర్తి సురేష్.. పవన్‌కి మరదలి పాత్రలో కనిపించనుందట. పవన్, త్రివిక్రమ్ గత చిత్రం 'అత్తారింటికి దారేది'లో సమంత మరదలు పాత్రలో సందడి చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే తరహా పాత్రలో కనిపించనుందన్నమాట. అంతేగాకుండా, ఈ సినిమాలో పవన్, కీర్తి మధ్య సాగే సన్నివేశాలు వినోదభరితంగా ఉంటాయని తెలిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com