close
Choose your channels

ర‌వితేజ త‌రువాత నాగార్జున‌తో..

Wednesday, December 27, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2016 సంక్రాంతికి సంద‌డి చేసిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఇందులో బంగార్రాజుగా నాగార్జున చేసిన హంగామా అభిమానుల‌ను మెప్పించింది. ఈ చిత్రంతోనే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు కళ్యాణ్ కృష్ణ. తన మొద‌టి సినిమాతోనే నాగార్జునని ఆకట్టుకున్నారీ డైరెక్టర్. అందుకే తన తదుపరి చిత్రం కూడా నాగ్ బ్యానరులోనే చేసారు కళ్యాణ్.

నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా 'రారండోయ్‌ వేడుక చూద్దాం' పేరుతో ఈ సినిమాని తెరకెక్కించారు. మూడవ సినిమా కూడా నాగ్ బ్యానర్ లోనే చేస్తానని చెప్పిన కళ్యాణ్ కృష్ణ.. బంగార్రాజు కథని నాగార్జునకి వినిపించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఆ కథ పట్టాలెక్కలేదు.

నాగ్ కూడా తన వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోవడం వలన ఈ డైరెక్టరుతో సినిమా చేయడం కుదరలేదు. ఈ గ్యాప్ లో కళ్యాణ్ కృష్ణ రవితేజకి కథ వినిపించడం, రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం చకచకా జరిగిపోయాయి. రవితేజతో సినిమా అవగానే నాగ్ తో తన నాలుగో సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నార‌ట స‌ద‌రు దర్శకుడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment