రవితేజ తరువాత నాగార్జునతో..
- IndiaGlitz, [Wednesday,December 27 2017]
2016 సంక్రాంతికి సందడి చేసిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఇందులో బంగార్రాజుగా నాగార్జున చేసిన హంగామా అభిమానులను మెప్పించింది. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు కళ్యాణ్ కృష్ణ. తన మొదటి సినిమాతోనే నాగార్జునని ఆకట్టుకున్నారీ డైరెక్టర్. అందుకే తన తదుపరి చిత్రం కూడా నాగ్ బ్యానరులోనే చేసారు కళ్యాణ్.
నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా 'రారండోయ్ వేడుక చూద్దాం' పేరుతో ఈ సినిమాని తెరకెక్కించారు. మూడవ సినిమా కూడా నాగ్ బ్యానర్ లోనే చేస్తానని చెప్పిన కళ్యాణ్ కృష్ణ.. బంగార్రాజు కథని నాగార్జునకి వినిపించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఆ కథ పట్టాలెక్కలేదు.
నాగ్ కూడా తన వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోవడం వలన ఈ డైరెక్టరుతో సినిమా చేయడం కుదరలేదు. ఈ గ్యాప్ లో కళ్యాణ్ కృష్ణ రవితేజకి కథ వినిపించడం, రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం చకచకా జరిగిపోయాయి. రవితేజతో సినిమా అవగానే నాగ్ తో తన నాలుగో సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట సదరు దర్శకుడు.