రాంచరణ్ తర్వాత సమంత.. ఎంత కాస్ట్లీ అయినా ఓకే, అందుకేనా!

  • IndiaGlitz, [Thursday,July 08 2021]

పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టేలా దూసుకుపోతోంది టాలీవుడ్. బాహుబలి తర్వాత ఈ సాంప్రదాయం మొదలయింది అని చెప్పొచ్చు. పాన్ ఇండియా లెవల్ లో హిందీ మార్కెట్ చాలా పెద్దది. హిందీ ఆడియన్స్ పై ఫోకస్ పెట్టాలంటే ముంబైలో నివాసం ఏర్పరుచుకోవాలి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముందుచూపుతో ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్నారు. 

దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం ఉంది. ఇక భవిష్యత్తులో కూడా చరణ్ పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రాంచరణ్ ముంబైలో ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది.

స్టార్ హీరోయిన్ సమంత కూడా చరణ్ బాటలోనే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత కూడా త్వరలో ముంబైలో ఖరీదైన ఇంటిని కొనేందుకు రెడీ అవుతోందట. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత పెర్ఫామెన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఆ సిరీస్ బిగ్ సక్సెస్ గా మారింది. సౌత్ లో సమంతకు ఎలాగు క్రేజ్ ఉంది.

హిందీ ప్రేక్షకులు కూడా ఫ్యామిలీ మ్యాన్ 2లో సామ్ నటనకు ఫిదా అయ్యారు. దీనితో సామ్ బాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. బాలీవుడ్ లో చిత్రాల్లో నటించేందుకు ఆమెని పలువురు దర్శకులు, నిర్మాతలు అప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనకు ముంబైలో ఇల్లు ఉంటే బావుంటుంది అని సామ్ భావిస్తోందట. 

ప్రస్తుతం సమంత.. గుణశేఖర్ రూపొందింస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'శాకుంతలం'లో నటిస్తోంది. భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు. దీనికి తోడు నాగ చైతన్య కూడా బాలీవుడ్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో.. ఎంత కాస్ట్లీ అయిన ముంబైలో మంచి ఇల్లు కొనాలనే ప్లాన్ లో సమంత ఉంది.

More News

డాక్టర్లూ ఈ వీడియో మీ దగ్గర పెట్టుకోండి.. ఇంత నిర్లక్ష్యమా, వందలాదిమంది ఇలా.. 

కరోనా మహమ్మారి విడతల వారీగా ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే మొదటి వేవ్, రెండవ వేవ్ అటూ లక్షలాది ప్రాణాలని బలితీసుకుంది మహమ్మారి.

నీళ్లు లేని బావిలో దూకాలంటే దూకొచ్చు.. ప్రకాష్ రాజ్ పై నరేష్ సెటైర్లు!

మా ఎన్నికల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. గత మార్చిలోనే మా ఎన్నికలు జరగాల్సింది.

మోడీ కేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డికి ప్రమోషన్.. ఆ 43 మంది వీరే!

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి తన కేబినెట్ ని విస్తరిస్తున్నారు.

మేం థియేటర్లు ఓపెన్ చేయం.. టాలీవుడ్ నిర్మాతలకు బిగ్ షాక్

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి థియేటర్ల పునః ప్రారంభానికి సిద్ధం అవుతున్న తరుణంలో టాలీవుడ్ నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది.

మాకు 'పీకే' వద్దు, ఏపీలో చనిపోతుంది అని తెలుసు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.