కంఫర్మ్: 'పుష్ప' తర్వాత 'ఐకాన్'.. బన్నీ చిత్రాల లైనప్ ఇదే!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ పుష్పలో నటిస్తున్నాడు. బన్నీ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
ఇదీ చదవండి: మహేష్‌తో మళ్ళీ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తుందని...
పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు బన్నీ వాసు. బన్నీ వాసు అల్లు అర్జున్ కి సన్నిహితుడిగా ఉంటూ నిర్మాతగా రాణిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కే చిత్రాలని వాసు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప చిత్రంపై, అల్లు అర్జున్ తదుపరి చిత్రాలపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
పుష్ప మొదలైనప్పుడు రెండు భాగాలుగా మారుతుందని అనుకోలేదని అన్నారు. ప్రస్తుతం పుష్ప మొదటి భాగంపై ఫోకస్ పెట్టాం. పుష్ప 2 కథపై ఇంకా కసరత్తు చేయాల్సి ఉంది అని అన్నారు. పుష్ప మొదటి భాగం పూర్తి కాగానే అల్లు అర్జున్ 'ఐకాన్' చిత్రంలో నటిస్తారని బన్నీ వాసు కంఫర్మ్ చేశారు.
ఐకాన్ ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిలో వాస్తవం లేదని బన్నీ వాసు ప్రకటనతో తేలిపోయింది. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ బన్నీతో ఐకాన్ చిత్రం తెరకెక్కించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఐకాన్ పూర్తి కాగానే తిరిగి పుష్ప 2 ప్రారంభం అవుతుందట. పుష్ప 2 తర్వాత బన్నీ.. కొరటాల శివ, మురుగదాస్, బోయపాటి శ్రీను లతో సినిమాలు చేస్తారని బన్నీవాసు తెలిపారు.
ముందుగా ఏ దర్శకుడితో చిత్రం ఉంటుందనేది అప్పటి పరిస్థితలని బట్టి నిర్ణయం ఉంటుందని బన్నీ వాసు అన్నారు. మురుగదాస్ తో కూడా బన్నీకి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక బోయపాటి దర్శకత్వంలోని చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటుందట.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇటీవల తగ్గేదేలే అంటూ విడుదలైన పుష్ప టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. బన్నీ సరసన ఈ చిత్రంలో రష్మిక నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments