పూరీ తర్వాత శ్రీనువైట్లనే
Send us your feedback to audioarticles@vaarta.com
'బెంగాల్ టైగర్' తరువాత ఏడాదికిపైగా విరామం తీసుకున్న రవితేజ.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 'రాజా ది గ్రేట్' దీపావళికి రిలీజ్ అవుతుంటే..రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం 'టచ్ చేసి చూడు' చిత్రీకరణ దశలో ఉంది. వీటితో పాటు తమిళ హిట్ చిత్రం 'బోగన్' రీమేక్ లోనూ నటించేందుకు రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. తనకు కలిసొచ్చిన అగ్ర దర్శకుడు శ్రీనువైట్లతోనూ ఓ సినిమా చేసేందుకు రవితేజ సిద్ధమవుతున్నాడని సమాచారమ్.
'నీకోసం, వెంకీ, దుబాయ్ శీను' వంటి విజయవంతమైన చిత్రాల తరువాత వీరి కాంబినేషన్లో రానున్న సినిమా ఇదే. హీరోగా రవితేజ ఎక్కువగా నటించింది పూరీ జగన్నాథ్ చిత్రాల్లోనే. ఈ ఇద్దరి కలయికలో 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు'.. ఇలా ఐదు సినిమాలు వచ్చాయి. ఆ తరువాత స్థానం శ్రీనువైట్లదే కావడం గమనార్హం. పూరీ దర్శకత్వంలో మొదటి మూడు సినిమాలు హిట్టయ్యాయి. నాలుగోసినిమా ఆశించిన విజయం సాధించలేదు. మరి శ్రీనువైట్ల కూడా అదే బాటలో వెళతాడో లేదంటే నాలుగో సినిమాతో హిట్ కొడతాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com