నిన్న ప్రభాస్..ఇప్పుడు బన్ని...
Send us your feedback to audioarticles@vaarta.com
రష్మీకా మండన్నా..పేరు చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియక పోవచ్చు. భవిష్యత్లో మాత్రం రష్మీక పేరు మారు మ్రోగుతుంది. ఎందుకంటే గతేడాది కన్నడంలో విడుదలైన కిర్రిక్ పార్టీ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడుకు తెలుగులో మంచి గిరాకీ ఏర్పడింది. హీరోలందరూ ఈ అమ్మడును తమ సినిమాలో నటించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా యు.వి.క్రియేషన్స్ నిర్మించబోయే చిత్రంలో రష్మీకా హీరోయిన్గా ఎంపికైంది. అల్రెడి నాగశౌర్య సినిమాలో నటిస్తుంది. రీసెంట్ బన్ని సినిమాలో కూడా రష్మీక పేరును హీరోయిన్గా పరిశీలిస్తున్నారట. వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్ని హీరోగా నాపేరు శివ..నా ఇల్లు ఇండియా సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన రష్మీ నటిస్తుందన్నమాట. ఏదేమైనా తెలుగులో ఒక సినిమా కూడా విడుదల కాకమునుపే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాల ఒడిసి పట్టుకుంటున్న రష్మీక గడుసుదే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments