అప్పుడు 'పోకిరి'..ఇప్పుడు 'భరత్ అనే నేను'
Send us your feedback to audioarticles@vaarta.com
“మాట ఇస్తే.. ఎంత కష్టమైనా వెనక్కి తీసుకోకూడదు.. ఆ మాట గాలిలో ఉండాలి తప్పా.. గాలిమాట కాకూడదు” అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేసిన చిత్రం ‘భరత్ అనే నేను’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ రివ్యూస్‌తో మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ముఖ్యమంత్రి భరత్ రామ్‌గా మహేష్ నటన సినిమాకే హైలైట్ అంటూ దర్శకధీరుడు రాజమౌళితో సహా పలువురు కొనియాడుతున్నారు. అంతేగాకుండా.. ఈ సినిమా మహేష్ కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రం అవుతుందని అంతా ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. 12 సంవత్సరాల క్రితం సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘పోకిరి’ సినిమాలో నటించారు మహేష్. ఈ సినిమాలో అండర్ కవర్ కాప్‌గా మహేష్ నటన అందర్నీ అలరించింది. తన వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. అంతేగాకుండా.. ఈ చిత్రంతో “ప్రిన్స్” నుంచి “సూపర్ స్టార్”గా ఎదిగారు. విశేషమేమిటంటే.. 2006లో ఏప్రిల్ ద్వితీయార్థంలో విడుదలైన ‘పోకిరి’ సినిమా మహేష్ జీవితాన్ని మలుపు తిప్పితే.. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇదే ఏప్రిల్ ద్వితీయార్థంలో ‘భరత్ అనే నేను’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని నమోదు చేసుకున్నారు మహేష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com