ఎన్టీఆర్ త‌ర్వాత మ‌హేశ్ మాత్ర‌మే చేస్తున్నాడు!!

  • IndiaGlitz, [Saturday,May 30 2020]

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌తో ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. కొత్త‌ద‌నంతో నిండిన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు కూడా ఆద‌రిస్తున్నారు. అందుక‌నే స్టార్ హీరోలంద‌రూ వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్పుడు మ‌హేశ్ 27 విష‌యంలోనూ అలాంటి వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇంత‌కూ ఆ న్యూస్ ఏంటో తెలుసా? మ‌హేశ్ త్రిపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడ‌ని.. వివ‌రాల్లోకెళ్తే.. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న త‌న‌ 27వ సినిమాలో మ‌హేశ్ మూడు పాత్ర‌లతో మెప్పిస్తాడ‌ని టాక్‌. అందుక‌నే రీసెంట్‌గా విడుద‌లైన మ‌హేవ్ ఫొటోల్లో ఆ వేరియేష‌న్ క‌న‌ప‌డింద‌ని అంటున్నారు. యంగ్ లుక్‌, యువ‌కుడిగా, మ‌ధ్య వ‌య‌స్కుడి పాత్ర‌లో మ‌హేశ్ క‌నిపిస్తార‌ని టాక్‌.

ఆదివారం మ‌హేశ్ 27వ చిత్రం ఓపెనింగ్ చాలా సింపుల్‌గా జ‌రుగుతుంద‌ని అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ కార‌ణంగా ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. రేప‌టికి సినిమా యూనిట్ వివ‌రాల‌తో పాటు టైటిల్‌ను విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు. ఈ చిత్రానికి స‌ర్కార్ వారి పాట అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇండియన్ బ్యాంకుల‌ను మోసం చేసి విదేశాల‌కు పారిపోయిన ధ‌న‌వంతుల నుండి హీరో ఎలా డ‌బ్బుల‌ను రాబ‌ట్టాడ‌నేదే అస‌లు క‌థ అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.