నిన్న విజయ్..నేడు ఎన్టీఆర్..రేపు అజిత్...
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళంలో సూపర్ స్టార్ ఆయన. ఐదు పదులు దాటినా కలెక్షన్లు రాబట్టడంలో తన సత్తానే వేరు. అలాంటి ఆ అగ్ర కథానాయకుడు పరాయి భాషల్లోనూ ప్రముఖ కథానాయకుల పక్కన అతిథి వేషాల్లోనో లేదంటే కీలక పాత్రల్లోనూ తళుక్కుమంటుంటారు. ఇంతకీ ఆ స్టార్ ఎవరో ఇప్పటికే అర్థమైఉంటుంది. అతడే.. మోహన్ లాల్.
ఈ మధ్యే తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌తో 'జిల్లా' చిత్రంలో కలిసి నటించిన లాల్.. ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మన స్టార్ హీరో ఎన్టీఆర్‌తో కలిసి 'జనతా గ్యారేజ్' చేస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుంది. ఈ లోపే మరో టాప్ హీరోతోనూ కలిసి నటించేందుకు లాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆ హీరో మరెవరో కాదు.. అజిత్. విష్ణువర్దన్ దర్శకత్వంలో అజిత్ నటించనున్న చిత్రంలో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నారని తమిళనాట కథనాలు వినిపిస్తున్నాయి. ఈ తీరున మున్ముందు మరిన్ని మల్టీస్టారర్ సినిమాల్లో లాల్‌ని చూసే అవకాశముందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com