నిన్న విజయ్..నేడు ఎన్టీఆర్..రేపు అజిత్...

  • IndiaGlitz, [Wednesday,May 11 2016]

మ‌ల‌యాళంలో సూప‌ర్ స్టార్ ఆయ‌న‌. ఐదు ప‌దులు దాటినా క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డంలో త‌న స‌త్తానే వేరు. అలాంటి ఆ అగ్ర క‌థానాయ‌కుడు ప‌రాయి భాష‌ల్లోనూ ప్ర‌ముఖ క‌థానాయ‌కుల ప‌క్క‌న అతిథి వేషాల్లోనో లేదంటే కీల‌క పాత్ర‌ల్లోనూ త‌ళుక్కుమంటుంటారు. ఇంత‌కీ ఆ స్టార్ ఎవ‌రో ఇప్ప‌టికే అర్థ‌మైఉంటుంది. అత‌డే.. మోహ‌న్ లాల్‌.

ఈ మ‌ధ్యే త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్‌తో 'జిల్లా' చిత్రంలో క‌లిసి న‌టించిన లాల్‌.. ఆ సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌స్తుతం మ‌న స్టార్ హీరో ఎన్టీఆర్‌తో క‌లిసి 'జ‌నతా గ్యారేజ్' చేస్తున్నారు. ఆగ‌స్టులో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ లోపే మ‌రో టాప్ హీరోతోనూ క‌లిసి న‌టించేందుకు లాల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. అజిత్‌. విష్ణువర్దన్ దర్శకత్వంలో అజిత్ న‌టించ‌నున్న చిత్రంలో మోహ‌న్ లాల్ ఓ కీల‌క పాత్ర చేసేందుకు ఒప్పుకున్నార‌ని త‌మిళ‌నాట క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ తీరున‌ మున్ముందు మ‌రిన్ని మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో లాల్‌ని చూసే అవ‌కాశ‌ముంద‌న్న‌మాట‌.

More News

కాజల్ తోనైనా లెక్క మారుతుందా?

ట్రెండ్ సెట్టింగ్ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన ఘనత ఆయనది.ఆ తరువాత కూడా రెండు సంచలన విజయాలను నమోదు చేసుకున్నప్పటికీ వరుస పరాజయాలు అతని హవాకి బ్రేక్ వేశాయి.

నవీన్ చంద్ర 'చందమామ రావే'

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యి యూత్ హర్ట్ ని దొచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రానికి చందమామ రావే అనే టైటిల్ ని ఖరారు చేశారు.

'ప్రేమమ్ ' కి అదో ప్లస్

మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్'..తెలుగులో అదే పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్,అనుపమ పరమేశ్వరన్,మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

బన్ని బ్రదర్ సినిమా..సెంటిమెంట్ అధిగమిస్తుందా?

సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు అల్లు అర్జున్ . 'సరైనోడు'తో సాలిడ్ హిట్ ని సొంతం చేసుకున్న బన్ని..ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదించే పనిలో ఉన్నాడు.

త్రివిక్రమ్ ఆమెకి స్కోప్ ఇచ్చాడా?

త్రివిక్రమ్ తన పాత శైలికి వెళ్లి రూపొందించిన చిత్రం 'అ..ఆ..'నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్,నదియా..ఇలా భారీ తారగణమే ఈ చిత్రంలో నటించింది.