అప్పుడు నిత్యా..ఇప్పుడు మేఘా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకే హీరోయిన్‌తో రెండు వరుస సినిమాలు చేయడం నితిన్‌కి సెంటిమెంట్‌గా మారనుందా? అవుననే అనిపిస్తోంది అతని తీరు చూస్తోంటే. తన కెరీర్ గాడి తప్పినప్పుడు ఇష్క్ చిత్ర విజయం నితిన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కట్ చేస్తే.. తన తదుపరి సినిమాలో కూడా ఇష్క్ హీరోయిన్ నిత్యా మీనన్‌నే కథానాయికగా ఎంచుకుని అప్పట్లో మరో హిట్ కొట్టాడు నితిన్.
నాలుగు సంవత్సరాల తరువాత మళ్లీ మరో హీరోయిన్‌ని ఇలా రెండు వరుస చిత్రాల కోసం ఎంచుకున్నాడీ యంగ్ హీరో. ఆ హీరోయినే మేఘా ఆకాష్. విశేషమేమిటంటే.. నిత్యా తనకి హిట్ పెయిర్ అనిపించాకే రెండో అవకాశం ఇస్తే.. మేఘా విషయంలో తొలి చిత్రం రిలీజ్‌కి ముందే సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం లై ఇటీవలే విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో నడుస్తోంది. రెండో సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. నిత్యాలా అంతగా కలిసిరాకపోయినా.. మేఘాకి నితిన్‌తో రెండో అవకాశం దొరకడం అదృష్టమే. నితిన్, మేఘాల కాంబినేషన్‌లో రానున్న ఆ రెండో చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మిస్తుండడం విశేషం. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com