నితిన్ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో..
Send us your feedback to audioarticles@vaarta.com
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దర్శకుడిగా శ్రీనివాస్ రెడ్డికి ఇదే తొలి చిత్రం. ఈ మూవీని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశమున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్‌గా నటించనుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అధికారికంగా ఇంకా కన్‌ఫర్మ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో 'ఒకరికి ఒకరు' ఫేమ్ శ్రీరామ్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారని తెలిసింది. ఇటీవలే నితిన్ హీరోగా వచ్చిన 'లై' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు శ్రీరామ్. ఆ తరువాత చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం.
థ్రిల్లర్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కూడా ఆయన పూర్తి నిడివిగల పాత్రను పోషించనున్నారని సమాచారం. మార్చి 2వ తేదీ నుంచి చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీవాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'సాక్ష్యం'లోనూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మే 11న విడుదలకు ముస్తాబవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments