అప్పుడు ముంతాజ్.. ఇప్పుడు రాయ్ లక్ష్మీ..
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ కళ్యాణ్ సినిమాకు హిట్ టాక్ వస్తే.. ఆ సినిమా రేంజ్ కచ్చితంగా బ్లాక్‌బస్టర్ నే. 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' వంటి ఘనవిజయాలతో ఇటీవల కాలంలో ఈ విషయం మరోసారి ఫ్రూవ్ అయింది. ఇక పవన్ సినిమాల్లో 'ఖుషి' ప్రత్యేకమైనది. అప్పట్లో యువత ఈ సినిమాని పదేపదే చూసి ఇండస్ట్రీ హిట్‌ని కూడా చేసేశారు.
ఆ సినిమాలో బాగా పేలిన పాత్రల్లో అనిత పాత్ర కూడా ఒకటి. హాట్‌హాట్‌గా ఉండే ఆ క్యారెక్టర్ లో ముంతాజ్ కుర్రకారుని బాగానే కిక్కెక్కించింది. ఆ తరహా పాత్ర మళ్లీ పవన్ సినిమాల్లో పడలేదు. ఇప్పుడు ఆ లోటుని తీరుస్తూ పవర్ స్టార్ నయా చిత్రం 'సర్ధార్ గబ్బర్‌సింగ్'లో ఓ రోల్ ఉందట. దాని కోసమే రాయ్ లక్ష్మీని చిత్రయూనిట్ ఎంపిక చేసుకుంది. ఇందులో రాయ్ లక్ష్మీ హొయలు, నటన నాటి 'ఖుషి'లోని ముంతాజ్ పాత్రకి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని ఇన్‌సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా 'సర్ధార్' థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com