మొన్న మహేశ్ పై.. ఇప్పుడు నమ్రత పై ట్రోలింగ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజాహెగ్దే జంటగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న మహర్షి అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ , మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ ప్రమోషన్లో భాగంగా మూవీ యూనిట్ బిజీబిజీగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేశ్ మాట్లాడుతూ.. తనకు లైఫ్ ఇచ్చిన, స్టార్‌ను దర్శకులందరికీ ధన్యవాదాలు చెప్పి.. 'పోకిరి'తో సూపర్‌స్టార్‌ను దర్శకుడు పూరీ జగన్నాధ్‌ను మరవడంతో పెద్ద ఎత్తున విమర్శలు.. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిన్నగా తేరుకున్న మహేశ్.. ట్విట్టర్ వేదికగా పూరీని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ గుర్తుకుతెచ్చుకున్నారు. ఇది అయిపోయిన సంగతి.. అయితే ఇప్పుడు మహేశ్ సతీమణి నమ్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం కూడా సేమ్ టూ సేమ్ ఓ వ్యక్తిని మరిచిపోవడమే.
అసలు విషయమేంటి..? ఎందుకీ ట్రోలింగ్స్..!
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా వచ్చిన విక్టరీ వెంకటేశ్, విజయ దేవరకొండకు ఇన్స్టాగ్రామ్ వేదికగా నమ్రత థ్యాంక్స్ చెప్పారు. అయితే సినిమా యూనిట్ గురించి ఆమె పట్టించుకోలేదని ముఖ్యంగా అల్లరి నరేశ్ లాంటి వ్యక్తి పేరు మరిచిపోవడంతో.. ట్రోలింగ్స్ మొదలయ్యాయి. మీరు ఎంత పెద్ద స్టార్లు అయితే మాత్రం చిన్న నటులను ప్రోత్సహించకపోతే ఎలా మేడం.. నరేశ్ గురించి ఒక పోస్ట్ పెట్టండి అంటూ అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు. అల్లరి నరేశ్ అభిమానులు కొందరు ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఈ ట్రోలింగ్‌కు మాత్రం ఆమె స్పందిచలేదు.
అసలు నరేశ్‌కు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి..!?
వాస్తవానికి 'మహర్షి' మూవీలో నటిస్తున్నాడు.. అది కూడా కీలకపాత్ర కాబట్టి ఆయనకు ఎలాంటి థ్యాంక్స్ చెప్పాల్సిన అక్కర్లేదన్నది నమ్రత అభిప్రాయమై ఉండొచ్చు. ఎందుకంటే ఈవెంట్‌కు వచ్చినవాళ్లను గౌరవించడం ఆమె బాధ్యత గనుక వెంకీ, విజయ్‌కు థ్యాంక్స్ చెప్పారు. మహేశ్ అభిమానులు, తన అభిమానులతో నిత్యం సోషల్ మీడియాలో టచ్‌లో ఉండే నమ్రత ఆసక్తికర విషయాలు ట్వీట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటారు. సో.. నెటిజన్లు కూడా కాస్త ఒకటికి రెండు సార్లు ట్రోలింగ్ చేసే ముందు ఆలోచించాలి.. ఏదో దొరికింది కదా అవకాశమని రెచ్చిపోకుండా ఎదుటివారిని నొప్పించకూడదని విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments